కాళేశ్వరంతో కేసీఆర్ నిధులన్నీ దుర్వినియోగం చేసిండు: వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరంతో కేసీఆర్ నిధులన్నీ దుర్వినియోగం చేసిండు: వివేక్ వెంకటస్వామి
  •   కాంట్రాక్టర్లలే  ధనవంతులు అయిండ్రు
  •  నియోజకవర్గాన్ని మోడల్​గా తీర్చిదిద్దుతా 
  • చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి 

కోల్​బెల్ట్​:  ‘ పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో కేసీఆర్​ 8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసిండు.  ఇందులో ఎంత మింగడో అర్థం కాని పరిస్థితి.  రూ. 1.25 కోట్లతో చేపట్టిన కాళేశ్వరంతో నిధులన్నీ దుర్వినియోగం అయ్యాయి.  మిషన్​భగరథ స్కీంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రపంపంచంలోని ధనవంతులు అయ్యారు.. పదేండ్ల  బీఆర్​ఎస్​పాలనలో ప్రజలను నమ్మించి  మోసం చేయడం తప్పా.. కేసీఆర్​చేసిందీ ఏమీ లేదు.’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన  పరిశీలించారు. ఆయా వార్డుల్లో త్వరలో చేపట్టాల్సిన పనులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మిషన్​భగీరథతో  రూ.60వేల కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగమైందన్నారు.  

 ‘ కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని స్కీంలు  ఫెయిల్ అయ్యాయి.  కేవలం నిధులు దొచుకోవడం, మింగేందుకు పథకాలు పెట్టిండు.  కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించారు.  కాంగ్రెస్ సర్కార్ అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోంది.  ప్రజాప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కగా  అమలు చేస్తున్నం.   సన్నవడ్లకు రైతులకు ఇచ్చే బోనస్ తో  మంచి మేలు జరుగుతుంది.   ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని  రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆరు నెలల్లోనే  పనులన్నీ పూర్తి చేస్తం. త్వరలో మరో రూ.20 కోట్ల అభివృద్ది పనులకు ప్రతిపాదనలు చేస్తం.  ప్రజలకు అవసరమైన పనుల కోసం నిధులు కేటాయిస్తున్న. రానున్న రోజుల్లో చెన్నూరు మోడల్​నియోజకవర్గంగా మారుస్త’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.