
హైదరాబాద్ : SC ST అధికారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ SC, ST ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ బాటలో నడుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అంబేద్కర్ కళాశాల స్థాపించి పేద పిల్లలకు విద్యను అందిస్తున్నామన్నారు. యువతలో స్కిల్స్ పెంచేందుకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్, జామ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని వివేక్ వెంకటస్వామి అన్నారు. చాలా గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు.
►ALSO READ | ప్రతి మహిళ మల్టీ టాస్కింగ్ చేస్తది..ఆడపిల్లలను చిన్నచూపు చూడొద్దు: సరోజా వివేక్
మైండ్ సెట్ మారితే కులాలు అనేవి తగ్గించొచ్చన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచి ఆలోచనతో పదిమందికి సహాయం చేయాలని సూచించారు. SC, ST అధికారులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంబేద్కర్ కుల నిర్మూలనకోసం పోరాటం చేశారు.. ఇప్పటికి గ్రామాల్లో ఎస్సీ కాలనీలు ఉరికి చివరలో ఉన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.