
- చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- పలు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతులు
జైపూర్/చెన్నూరు, వెలుగు : నియోజకవర్గంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, జైపూర్మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమారం మండల కేంద్రంలో రూ.30 లక్షలతో నిర్మించిన మండల విద్యా వనరుల కేంద్రం బిల్డింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమారంలో ఆస్పత్రి, బస్టాండ్, సులబ్‌కాంప్లెక్స్, మార్కెట్ యార్డు, విద్యుత్ సబ్‌స్టేషన్, క్రికెట్ గ్రౌండ్స్థలాల కోసం పలువురు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించగా..
వెంటనే స్థలాలు కేటాయించాలని భీమారం తహసీల్దార్విశ్వంభర్ను ఆదేశించారు. వీఎస్ఎస్లో పనిచేసిన డబ్బులు ఇవ్వలేదని కూలీలు చెప్పగా డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుందని, ఆ భూములను తిరిగి ఇప్పించాలని పలువురు కోరారు. జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం ఈదులవాగుపై జరుగుతున్న బ్రిడ్జి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వివేక్పరిశీలించి, నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో భీమారం ఎంఈఓ రాధాకృష్ణ, మండల కాంగ్రెస్లీడర్లు భూక్య లక్ష్మణ్, పొడేటి రవి, మోహన్ రెడ్డి, సత్య నారాయణ రెడ్డి, సర్పంచులు రాంరెడ్డి, దుర్గం మల్లేశ్, జైపూర్ మండల సీనియర్ లీడర్ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. భీమారంలోని కోదండ రామాలయం, జైపూర్ ఆంజనేయస్వామి ఆలయాలను ఎమ్మెల్యే వివేక్ దర్శించుకున్నారు. అయోధ్యలో రామ మందిర విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ఆలయాలల్లో పూజలు చేశారు.
క్రికెట్ టోర్నీవిజేతలకు ప్రైజ్‌లు అందజేత
చెన్నూరు పట్టణంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్‌పోటీల్లో గెలుపొందినవారికి ఎమ్మెల్యే వివేక్బహుమతులు అందజేశారు. స్థానిక హైస్కూల్గ్రౌండ్లో జరిగిన కార్యక్రమానికి ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరై విజేతలకు షీల్డ్స్అందించారు. విజేతగా నిలిచిన జట్టుకు సొంతంగా రూ.15 వేలు, రన్నరప్జట్టుకు రూ.10 వేలు అందజేశారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చెన్నూర్ పట్టణంలో శ్రీ రాజ రాజేశ్వర షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ వైస్చైర్మన్మూల రాజిరెడ్డి, గొడిసెల బాపురెడ్డి, జుల్ఫకర్, మైదం రవి, హిమవంత్‌రెడ్డి, చల్లా రాంరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులున్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
కోటపెల్లి మండలంలోని సిర్సా, దేవులవాడ, కొల్లూరు గ్రామాల్లో ఇటీవలే చనిపోయిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొడిషెల మొండయ్య, అసరెల్లి లక్ష్మి, జంగ అశోక్ రెడ్డి కుటుంబాలను ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. పెగడపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మద్దుల సత్యనారాయణరెడ్డి తల్లి మృతిచెందగా ఆయనను పరామర్శించారు. కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి మిత్రుడైన జైపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధం చంద్రయ్యను కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.