
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్నబియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం మోడీది అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కేంద్రం మనం కట్టే పన్నులు ఉత్తరాదికి పంచుతోందని అన్నారు వివేక్ వెంకటస్వామి. సోనియాగాంధీ గారు గొప్ప మనిషి అని.. అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నట్టు పోరాటం చెసెవాల్లమని అన్నారు.
అంబేద్కర్ మనందరికి దారి చూపించాడని.. ఇన్ని విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని అనుకుంటారు కానీ.. ఆయన విగ్రహం చూసినప్పుడు అందరికి ఆదర్శంగా.. చదవాలి అనిపించేలా ఉంటుందని అన్నారు. కాకా వెంకటస్వామి గారి సూచన తో దాదాపు 120 కి పైగా విగ్రహాలు నెలకొల్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జై బాపు జై సంవిధాన్ నినాదం తీసుకుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 900 కోట్ల సిఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని.. కేసీఆర్ ఎక్కడా సరిగా డబుల్ బెడ్రూం ఇళ్ళు కూడా కట్టలేదని.. కోడళ్లు, కూతురికి వందల ఎకరాలు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారని అన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తామని ఎవరూ ఊహించలేదని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం మాఫియా నడిచిందని అన్నారు వివేక్ వెంకటస్వామి. రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా యువకులకు మేలు జరుగుతుందని.. ప్రజాపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారు అందరికి మంచి చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.