
- 12 ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చూసిండ్రు
- మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థిని గెలిపించండి: చెన్నూరు ఎమ్మెల్యే
కోల్ బెల్ట్: ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో బీఆర్ఎస్ఫెయిల్అయిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఊరు మందమర్రి లో ఆయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 ఏండ్లుగా నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారని తెలిపారు. ‘మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిరుద్యోగుల్లో ఉత్సాహం నింపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 54 వేల ఉద్యోగాలు కల్పించింది. ఎన్నికల ముందు 2లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇచ్చిన మాటకు ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థిని గెలిపించండి’ అని వివేక్‌వెంకటస్వామి అన్నారు.
40 ఏండ్ల కల సాకార
భక్తుల సౌకర్యార్థం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ క్రాస్‌నుంచి బుగ్గ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్తేందుకు రోడ్డు సమస్య ఉంది. దాదాపు 40 ఏండ్ల నుంచి గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ప్రత్యేక చొరవతో 2 కోట్ల నిధులు మంజూరు చేసి ఆలయానికి కొత్తగా రోడ్డు వేయించారు. ఈ క్రమంలో ఇవాళ మంచిర్యాల జిల్లా కన్నాలలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి కన్నాలలో పర్యటించి, రోడ్డు పనులను పరిశీలించారు. ఈ మేరకు ఫారెస్ట్పరిష్మన్లు తీసుకువచ్చి 40 ఏండ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గ్రామస్థులు థ్యాంక్స్తెలిపారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారం. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బెల్లంపల్లి ఎక్స్ ప్రెస్రైళ్ల హాల్టింగ్‌కు కృషి చేస్తం
- వేమనపల్లి–చెన్నూరు రోడ్డుకు త్వరలో ఫారెస్ట్ క్లియరెన్స్
- బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి
బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో ఎక్స్‌ప్రెస్‌రైళ్లకు హాల్టింగ్, ఇతర సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కృషి చేస్తామని బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఎమ్మెల్యేలు పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సమష్టి గా కృషి చేస్తామన్నారు. బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు, వేమనపల్లి–చెన్నూరు రోడ్డు ఏర్పాటుకు నెలరోజుల్లో ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకవచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.