చెన్నూరు మండలంలోని దుబ్బపల్లె, నాగపూర్, పొక్కూరు గ్రామాల్లో నెలకొన్న తీవ్ర మంచినీటి సమస్యను ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు.
మూడు మోటర్లను అందించగా కాంగ్రెస్నేతలు ప్రారంభించారు. దీంతో ఆయా గ్రామాల్లో కొరత తీరనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చల్లా రామిరెడ్డి, హిమవంత రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రెడ్డి తదితరుపాల్గొన్నారు.
చెన్నూరు, వెలుగు