కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలం శెట్ పల్లి గ్రామంలో సరైన నీటి వసతి లేక కొన్నేండ్లుగా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఈ విషయాన్ని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సూరం సందీప్ రెడ్డి శనివారం ఫోన్ లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే.. గ్రామంలోని 2 వాడలకు 2 మోటార్లుపంపించారు.
దీంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోని పాలకులు సమస్యను పట్టించుకోకపోవడంతో తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సమస్య చెప్పగానే స్పందించి వెంటనే పరిష్కరించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు తాండ్ర పోచం, ఐటిపాముల రాజేశ్, మాజీ సర్పంచ్ రాంరెడ్డి పాల్గొన్నారు.