
చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలంలోని దుగ్నేపల్లి ఎస్టీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలిగిపోయాయి. తాగునీటి కోసం తాము ఇబ్బందులు పడుతున్నారని బోరు వేసి తమ కష్టాలు తీర్చాలని ఇటీవల ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గ్రామానికి వచ్చిన కాలనీ వాసులు విన్నవించారు.
త్వరలోనే బోరు వేయిస్తానని ఎమ్మెల్యే వారికి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎస్టీ కాలనీలో మంగళవారం బోరు వేయించి వారి నీటి కష్టాలు తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలుతెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.