పెద్దపల్లి, వెలుగు : శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన సతీమణీ గడ్డం సరోజ, కుమారుడు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ శుక్రవారం ఓదెల మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వివేక్ దంపతులకు, వారి కుమారుడు వంశీకృష్ణను ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా దేవాలయంలోకి ఆహ్వానించారు.
అనంతరం వివేక్ కుటుంబ సభ్యులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వివేక్‌ను శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం దృష్టికి ఉద్యమకారుల సమస్యల్ని తీసుకెళ్త
పెద్దపల్లి, వెలుగు : తెలంగాణ ఉద్యమకారుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ కుటుంబ సభ్యులు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు వివేక్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలు తనకు తెలుసన్నారు. తాను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశానని ఉద్యమకారుడిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్, అల్లం సతీశ్, వీరవేన శంకర్, గడ్డం బన్ని, , ఎర్రయ్య, సురేశ్ తదితరులున్నారు.