పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం పెద్దపల్లిలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెలు వివేక్ వెంకటస్వామి, వినోద్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, మక్కాన్ సింగ్ ఠాగూర్ లతోపాటు పలువరు నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచస్తుందన్నారు. రాష్ట్రంలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకుంటుందన్నారు. పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి చేసిన అభివృద్దే గడ్డం వంశీని గెలిపిస్తుందన్నారు. తనతోపాటు వంశీ కూడా ఎప్పుడూ పెద్దపల్లి ప్రజలసేవలోనే ఉంటామని చెప్పారు. తాను ఉన్నట్టే వంశీకూడా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలపారు. అందరి సమన్వయంతో పెద్దపల్లిలో భారీ మెజార్టీతో వంశీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
పెద్దపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం వంశీ కృషి చేస్తారని.. వంశీని గెలిపిస్తే పెద్దపల్లిలో యువతకు మంచి భవిష్యత్ ఉంటుందనని కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అన్నారు.