నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : వివేక్ వెంకటస్వామి

నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : వివేక్ వెంకటస్వామి
  • మిషన్ భగీరథ ఫెయిల్డ్ ప్రాజెక్ట్
  • వర్షాకాలం తర్వాత తాగునీటి సౌకర్యాలను మెరుగుపరుస్తా
  • ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు : చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శనివారం జైపూర్, భీమారం మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనులు చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని చెన్నూరు, మందమర్రి, క్యాతనపల్లి, జైపూర్, భీమారం పట్టణాల్లో ప్రజలకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

పట్టణాల్లో రూ.6 కోట్లు డీఎంఎఫ్​టీ, రూ.2 కోట్ల సీఎస్​ఆర్ ​ఫండ్స్​తో సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించామన్నారు. మిషన్​ భగీరథ ఫెయిల్డ్​ స్కీమ్​ అని ఎమ్మెల్యే అన్నారు. ఈ స్కీమ్​లోని లోపాల కారణంగా పదేండ్లుగా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లు వాసన, రంగుతో రావడంతో తాగేందుకు ఇష్టపడటం లేదన్నారు. వర్షాకాలం తర్వాత బోర్లు వేసి తాగునీటి సౌలత్​లను మరింతగా మెరుగుపర్చనున్నట్లు చెప్పారు. చెన్నూరు టౌన్​లోని మున్సిపల్ ​ఆఫీస్​నుంచి హైవే వరకు రూ.2 కోట్లతో సైడ్​ డ్రైయిన్స్ ​నిర్మించనున్నట్లు చెప్పారు. 

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

జైపూర్ మండలంలోని కుందారం, కిష్టాపూర్, పౌనూరు, వేలాల, శివ్వారం, భీమారం మండలంలోని కొత్తగూడెం, లంబడి తండా, పెరుక గూడెం, మాదన్న గూడెం  కాలనీల్లో ఎమ్మెల్యే పర్యటించారు. కుందారం, వేలాల మల్లికార్జున స్వామి ఆలయాల్లో పూజలు చేశారు. జైపూర్ మండల కేంద్రంలో పార్టీ ఆఫీస్​లో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు అందజేశారు. రూ.59 లక్షల డీఎంఎఫ్​టీ ఫండ్స్​తో భీమారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్​లో అదనపు తరగతి భవనాల నిర్మాణం, కొత్తగూడెం, లంబడి తండా, పెరుక గూడెం

మాదన్న గూడెం కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జైపూర్, భీమారం మండలాల ప్రెసిడెంట్లు, లీడర్లు​ మోహన్ రెడ్డి, ఫయాజోద్దిన్, చల్ల సత్యనారాయణ రెడ్డి, విశ్వంబర్ రెడ్డి, రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, చేకుర్తి సత్యనారాయణ రెడ్డి, పొడేటి రవి, మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ నాయాక్, బండి సదానందం, భూక్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.