చెన్నూరులో 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూరులో 108 అంబులెన్స్  సర్వీసులను  ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూరు పట్టణంలోని పీహెచ్ సీలో 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు ఎమ్మేల్యే  వివేక్ వెంకటస్వామి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి 2 అంబులెన్స్ లను  జెండా ఊపి ప్రారంభించారు  వివేక్ వెంకటస్వామి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. చెన్నూరు నియోజకవర్గం చాలా వెనుకబడిందని.. సరైన రవాణా సదుపాయం కూడా  లేదన్నారు.   గత ప్రభుత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీకి నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలకు సరైన వైద్యం అందలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పలు పాలు చేశారని విమర్శించారు.   ప్రజల రక్షణే  ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.102 అంబులెన్స్ లను కోటపల్లి మండల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే వివేక్. 

ALSO READ : కొల తిప్పిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

రెండు 102 వెహికల్స్ రిప్లేస్ చేసి కొత్తవి తీసుకొచ్చామన్నారు వివేక్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు మంచి సర్వీసు ఇస్తే ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్ టెక్నీషియన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  ప్రజలకు మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి . 102 అమ్మబడి అంబులెన్స్ అందుబాటులో లేనప్పుడు 108 అంబులెన్స్ కూడా వాడుకోవచ్చని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.