బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు వివేక్ వెంకటస్వామికి ఆహ్వానం

అమ్రాబాద్, వెలుగు: ఈ నెల 4  నుంచి   జరుగనున్న   లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి శనివారం ఆలయ కమిటీ ఆహ్వానం అందించింది.  హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆలయ కమిటీ సభ్యులు  కలిశారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. 

దీంతో ఆలయ అభివృద్ధికి   విరాళం అందించారు.  4 న నిర్వహించే స్వామివారి కల్యాణానికి హాజరవుతానని ఎమ్మెల్యే తెలిపారు.  కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఇమ్మడి నరహరి, బి.లింగం, దివాకర్, చెన్నకేశవులు, ఆనంద్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.