యూటర్న్ ఏర్పాటు చేయించండి : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి వినతి

యూటర్న్ ఏర్పాటు చేయించండి : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి వినతి

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల – -మందమర్రి నేషనల్​ హైవేపై సాయికుటీర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా దాటేందుకు యూటర్న్ ఏర్పాటుకు కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామిని కాంగ్రెస్​లీడర్లు కోరారు. శనివారం హైదరాబాద్​లో ఎమ్మెల్యేను  కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతంలో పలు కాలనీలతో పాటు స్కూళ్లు ఉన్నాయని చెప్పారు.

కొత్తగా నిర్మిస్తున్న నేషనల్​హైవే ఫోర్​లేన్ రహదారి డివైడర్​దాటడం స్థానికులు, స్టూడెంట్లకు  కష్టంగా ఉంటుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి దారి ఏర్పాటును పరిశీలించాలంటూ ఆర్అండ్​బీ ఈఈ భావుసింగ్​ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్​ ఏడో వార్డు మాజీ కౌన్సిలర్​ పోలం సత్యనారాయణ, స్థానిక లీడర్​ ఏల్పుల సత్యనారాయణ ఉన్నారు.