మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో మరమ్మ-సడవలమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తల్లుల దీవెనలతో సమృద్ధిగా పాడి పంటలు పండి, రైతులకు మంచి లాభం జరగాలని కోరుకున్నట్లుగా ఆయన తెలిపారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామానికి రోడ్డు వేసేందుకు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడానని.. పర్మిషన్ రాగానే పనులను చేపడుతామన్నారు ఎమ్మెల్యే వివేక్.
చెన్నూరు క్యాంప్ ఆఫీసుకు పలు సమస్యలతో వచ్చిన వారికి సమస్యలు తీర్చుతూ అధికారులతో ఎమ్మెల్యే వివేక్ మాట్లాడారు. పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ఫోన్ లో ఎడి అగ్రికల్చర్ ను ఆదేశించారు ఎమ్మెల్యే. విత్తనాలు అధిక ధరలకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అదేశించారు ఎమ్మెల్యే వివేక్. చెన్నూరు పెద్దచెరువులో చేపల వేట విషయంలో గంగపుత్రులు తెనుగు(ముదిరాజ్)కులస్థుల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం కోసం రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ తో మాట్లాడుతానని ముదిరాజులకు హామీ ఇచ్చారాయన.