గాంధారీ ఖిల్లాను దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గాంధారీ ఖిల్లాను దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి ఖిల్లా మైస్సమ్మ జాతరకు హాజరయ్యారు  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దేవత మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు వివేక్. గాంధారి మైస్సమ్మ జాతర కమిటీ, నాయక్ పోడ్ గిరిజన సంఘం  ఎమ్మెల్యే ను సత్కారించారు. 

అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే వివేక్.. గాంధారి ఖిల్లా జాతరలో పాల్గొని పూజలు చేయడం సంతోషంగా ఉంది. గత జాతరలో కన్నా ఈ సారి ఏర్పాట్లు ఎక్కువగా చేశాం.  సర్కార్ రూ. 44లక్షల జాతరకు కేటాయించింది. ఎస్టీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తా . అటవీ ప్రాంతం కావడంతో గాంధారి ఖిల్లా  అభివృద్ధికి పర్మిషన్ రావడం ఆలస్యం అవుతుంది. నాయక్ పోడ్ కులస్థుల భవన్ కోసం ల్యాండ్ , రూ. 20లక్షల ఫండ్స్ కేటాయిస్తా.  మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కృషి చేస్తా.  రూ. 100కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి . రూ. 40కోట్లతో క్యాతన పల్లి మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం పనులు జరుగుతున్నాయి.  రానున్న రోజుల్లో గాంధారిఖిల్లాను అన్ని విధాలా  అభివృద్ధి చేస్తా అని అన్నారు వివేక్. 

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యేలు అందరం కృషి చేస్తున్నాం. చెన్నూరు నియోజకవర్గ పట్టబద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఫిబ్రవరి 21 న ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందరెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు వివేక్.