ఎమ్మెల్యే వివేక్​ను కలిసిన ముస్లిం మతపెద్దలు

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు క్యాంపు ఆఫీస్లో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని బుధవారం రాత్రి పలువురు ముస్లింలు, మతపెద్దలు కలిశారు.  ఈ సందర్బంగా ఆయన వారికి ఖర్జూరపండ్లను తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముస్లింలు పేర్కొన్నారు. కాజీపూర వాడలోని కాంగ్రెస్​ కార్యకర్త సలీం ఇంట్లో ఎమ్మెల్యే వివేక్ ఇఫ్తార్​విందులో పాల్గొన్నారు. 

అనంతరం మాజీ మార్కెట్​కమిటీ చైర్మన్​ జుల్ఫకర్ ను​ కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కొత్తగూడెం కాలనీకి చెందిన కార్యకర్త సీర్ల సుధాకర్​రెడ్డి నివాసాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కో ఆప్షన్​ మెంబర్​ ఫయాజ్, ఖాజీ బాషిర్, జమీర్​అలీ, అన్వర్, ఇమామ్​ షరీప్ తదితరులు పాల్గొన్నారు.