మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క... ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్ కు వెళ్తున్నారు. ఈ సందర్భంలో చెన్నూరులో మంత్రి సీతక్కకు ఆహ్వానం పలికారు స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
మంచిర్యాలలోని MLA వివేక్ వెంకటస్వామి ఇంటికి వెళ్లారు సీతక్క. స్థానిక నేతలు, కార్యకర్తలు మంత్రికి సాదర స్వాగతం పలికారు. వివేక్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేశారు మంత్రి సీతక్క. తర్వాత చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రితో చర్చించారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు అభివృద్థికి అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు మంత్రి సీతక్క.