రామగుండం కార్పొరేటర్ తేజస్విని ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

రామగుండం కార్పొరేటర్  తేజస్విని ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ 11 వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ కుటుంబ సభ్యులను చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.   ప్రకాష్ తల్లి పెద్దెల్లి మధునమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో వారిని ఎమ్మెల్యే వివేక్ ఓదార్చారు.  మధునమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి వివేక్ నివాళులర్పించారు. ఎమ్మెల్యే వివేక్ వెంట రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఉన్నారు.