కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రాసేనా రెడ్డి కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి సేవలను కొనియాడారు వివేక్ వెంకటస్వామి. . ఆ రోజుల్లో ఇంద్రసేనారెడ్డి సంజయ్ గాంధీకి చాలా దగ్గరి వ్యక్తి . యూత్ కాంగ్రెస్ బలపరచడానికి చాలా కార్యక్రమాలు చేశారు. సౌత్ యూత్ కాంగ్రెస్ కి సంబంధించి అన్ని విషయాలలో సంజయ్ గాంధీ ఇంద్రసేనారెడ్డి అభిప్రాయం తెలుసుకునేవారు.
ALSO READ : క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం : మంత్రి డి.శ్రీధర్‌బాబు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనా రెడ్డి (81) అనారోగ్యంతో సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అక్టోబర్ 27న కన్నుమూసిన సంగతి తెలిసిందే.