పరిగి, వెలుగు :వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంకటయ్యను, ఆయన కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి పరామర్శించారు. వెంకటయ్య తల్లి రుక్కమ్మ సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్ మంగళవారం పరిగి పరిధి సుల్తాన్పూర్ గ్రామంలోని వెంకటయ్య ఇంటికి చేరుకుని పరామర్శించారు.
మృతికి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వివేక్ వచ్చిన సంగతి తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెళ్లి వెంకటయ్య కుటుంబం సభ్యులకు ధైర్యం చెప్పారు. పరిగి ఏఎంసీ చైర్మన్ పరశురాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత లాల్ కృష్ణ, సుల్తాన్పూర్గ్రామ సీనియర్ నాయకులు వెంకటరామిరెడ్డి, కులకచర్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భీమ్ రెడ్డి, మాల మహానాడు జిల్లా, మండల నాయకులు వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు.