
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నేత, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. హోలీ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో హోలీ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోలీ స్ఫూర్తిగా మంచిని స్వీకరిస్తూ చెడును తొలగిస్తూ అందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహంకారంతో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టం వచినట్టు చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల హక్కులను, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
Also Raed : సిటీలో ధూంధాంగా రంగుల పండుగ
ఇక.. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్ద రంగులు పూసుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ హోలీ వేడుకల పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా హోలీ సంబురాల్లో పాల్గొంటున్నారు.
ఈ హోళీ రంగులు మీ ఇంటింటా వసంతంగా కురవాలని, మీ జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు.. హోళీ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/Kc0IMfmtwR
— Dr Vivek Venkatswamy (@VivekVenkatswam) March 14, 2025