బోధన్ టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో వర్గపోరు

  • బోధన్ లో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌
  • అయోమయంలో క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిజామాబాద్, వెలుగు: బోధన్‌‌‌‌‌‌‌‌ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే షకీల్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ చైర్‌‌‌‌పర్స్‌న్‌ భర్త తూము శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే దూరం పెట్టడంతో గ్రూప్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైనట్లు తెలుస్తోంది. ఎడాదిలో ఎన్నికలు ఉండగా ఈ వర్గపోరు పార్టీ అభివృద్ధిని దెబ్బతీస్తుందని సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు అంటున్నారు.

వర్గపోరుకు కారణాలివే..

బోధన్ నియోజకవర్గం టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో వర్గవిబేధాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే షకీల్, బోధన్ మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ తూము పద్మ, ఆమె భర్త శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మధ్య విబేధాలు ముదురుతున్నట్లు తెలుస్తోంది. బోధన్‌‌‌‌‌‌‌‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు వివాదానికి ముందు పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన వ్యవహారంలో శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇది ఎమ్మెల్యే చేయించారన్నది మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌ వర్గీయుల ఆరోపణ. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీనికి తోడు మున్సిపాలిటీ కార్యకలాపాల్లో ఎమ్మెల్యే సోదరుడు, వైస్ చైర్మన్ సోహెల్ జోక్యం పెరగడం కూడా వీరిద్దరి వర్గపోరుకు దారి తీసినట్లు ప్రచారం సాగుతోంది.

నంబర్ 2 లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా..

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేత శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి బోధన్‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో క్రమంగా బలం పెంచుకున్నారు. ఆయన నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతూ పార్టీ కార్యక్రమాల్లో ముందుంటున్నారు.  శరత్‌‌ను కట్టడి చేయడంలో భాగంగానే చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ అధికారాలకు కోత పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దాని ఫలితంగానే చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌, మున్సిపల్ ఆఫీసర్ల మధ్య వివాదం మొదలైంది. పాలకవర్గంతో సంబంధం లేకుండా మున్సిపల్ ఆఫీసర్లు ఎజెండా రూపొందించడం వివాదాస్పదమైంది. ఈ ఏజెండా వివాదం పైకి కనిపిస్తున్నా.. లోలోపల కనిపించని రాజకీయ విబేధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే టైంలో శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వ్యవహారంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేయడంతో పార్టీలో విబేధాలు బయటపడ్డాయి. మొత్తానికి బోధన్‌‌‌‌‌‌‌‌లో నంబర్ 2గా ఎదుగుతున్న శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి పొమ్మన లేక పొగ పెడుతున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే శరత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా ఓ జాతీయ పార్టీ నేతలతో టచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తెలిసింది.