
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్‌లో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో చర్చిల నిర్మాణానికి తన వంతు సహకారం అందించానని గుర్తు చేశారు. సిద్దిపేట పట్టణంలో చక్కటి క్రైస్తవ భవనాన్ని నిర్మించుకున్నామని, సమాధుల కొసం స్థలాన్ని కూడా కేటాయించామని చెప్పారు. యేసు ప్రభు దీవెనలతో సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో పాటు నేతలు సికిందర్, సత్యానందం, రాజనర్సు , పాస్టర్లు పాల్గొన్నారు.