ఆర్థికంగా వెనుకబడినవారిని ఆదుకోవాలి

ఆర్థికంగా వెనుకబడినవారిని ఆదుకోవాలి

మేళ్లచెరువు, వెలుగు: కమ్మ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని ఏపీలోని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన లక్ష్మీతిరుపతమ్మ బ్రహ్మోత్సవాల్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. జాతరలో ఏర్పాటు చేసిన చౌదరి విద్యుత్ ప్రభను వారు ప్రారంభించి మాట్లాడారు. 

కమ్మ కులంలోని నిరుపేద విద్యార్థులను ఆదుకుంటామని తెలిపారు. జాతరను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సంఘ బలోపేతానికి అందరూ కోసం కృషి కోరారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాదెండ్ల బ్రహ్మం, ఎర్నేని వెంకటరత్నం, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.