తొర్రూరు/ రాయపర్తి, వెలుగు: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బర్త్డే సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డితో కలిసి కేక్కట్చేశారు.
కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్జిల్లా రాయపర్తిలో ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా నోట్బుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. జింకూతండాలో కార్యకర్తలు, తండావాసులతో కలిసి వారు నృత్యం చేశారు. పలుచోట్ల దుప్పట్లు పంపిణీ చేశారు.