
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై పాలకుర్తి MLA యశస్విని రెడ్డి ఫైర్ అయ్యారు.కాంగ్రెస్ నాయకులను తక్కువ అంచనా వేయొద్దన్నారు. కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే పొలిమేర వరకు తరిమికొడతామని హెచ్చరించారు. ఎర్రబెల్లి వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరని ఊరు ఉండదన్నారు. కాంగ్రెస్ సత్తా ఏంటో లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తాం..అక్కడ చూసుకుందాం.. మీ సత్తా ఏంటో?.. మా సత్తా ఏంటో అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారుఎమ్మెల్యే యశస్వి.
మీడియాతో మాట్లాడిన యశస్విని రెడ్డి.. అమ్మాయి చిన్నగా ఉంది.. సాఫ్ట్ గా ఉందని అనుకోకండి. మీకు అంతా ఇంట్రెస్ట్ ఉంటే అత్త-కోడళ్ళ సినిమా, సిరియల్ చూపిస్తా. ఇంకోసారి అత్తకోడళ్ళు అని మాట్లాడితే మర్యాదగా ఉండదు.. అందరికీ కుటుంబాలు ఉన్నాయి. పాలకుర్తినీ దోచుకుంది, దాచుకుందిBRS, మాజీ మంత్రి ఎర్రబెల్లి కాదా?BRS నేతలు భూ కబ్జాలు, దందాలు చేసి ప్రజలు సొమ్ము దోచుకున్నారు. మీ ఇండ్లలో పెళ్ళాలు.. బిడ్డలు.. అత్తకోడలు లేరా?...మా ఇంట్లోనే ఎందుకు తొంగిచూస్తున్నారు. మేంఅడోళ్ళం కాదు... ఆడ పులులం. అత్తకోడళ్ళు పార్టీ కాపాడుకుంటూ పాలకుర్తినీ అభివృద్ధి చేస్తున్నారు.
పాలకుర్తి ని వదిలేపెట్టి వెళ్లను ... నీ అంతా చూసే పోతా. మా కాంగ్రెస్ నేతల పావుగా వాడుకుంటున్న వారిని అంతాకూడా చూస్తా. గెలిచినప్పటి నుంచి మమ్మల్ని ఏడిపిస్తున్నారు... తప్పకుండా గుణపాఠం చెప్తా. కోవర్టులను ఏరిపారేస్తాం. MLA గా గెలిచాక పాలకుర్తికి చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. హైదరాబాద్ వెళ్లి ఫ్యామిలీతో కాకుండా నిధుల కోసం సీఎంను పదే పదే కలుస్తాను. అభివృద్ధి కాకుండా పచ్చకామెర్లు ఉన్నవాళ్లకు అంతా పచ్చకామెర్లలాగానే కనిపిస్తుంది అని ఎర్రబెల్లికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.