తొర్రూరులో 100 బెడ్స్​ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి :ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: తొర్రూరు డివిజన్​ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి పనులు స్టార్ట్​చేయాలని కోరుతూ సోమవారం హైదరాబాద్​లో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. పాలకుర్తిలోనూ 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.