మల్లాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

 మల్లాపూర్ గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

లక్ష్మణచాంద, వెలుగు: మండలంలోని మల్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆదివారం బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం గ్రామ పెద్దలు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడ్వాల రమేశ్, ముత్యం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు చిన్నయ్య, మాజీ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.