పాలమూరు, వెలుగు: గత ప్రభుత్వం పాలనలో ఉత్తర తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. దక్షిణాదిలో జరగలేదని, ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ముద్దు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
పార్లమెంట్ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. జిల్లాకు పదేండ్లుగా ఒక్క కంపెనీ కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య , వైద్యం, ఉపాధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సత్తుర్ చంద్రకుమార్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్, కౌన్సిలర్ శాంతయ్య పాల్గొన్నారు.