రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: రైతులకు నాణ్యమైన విద్యుత్  అందిస్తామని మహబూబ్​నగర్  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఏనెమీది తండాలో రూ.2.88 కోట్లతో, బుద్ధారం గ్రామంలో రూ.2.92 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్​స్టేషన్లకు గురువారం శంకుస్థాపన చేశారు. పదేండ్లలో రెండు సబ్​స్టేషన్లు ఏర్పాటు చేస్తే, ఏడాదిలో ఆరు సబ్ స్టేషన్లు మంజూరు చేసుకున్నామని చెప్పారు.

విద్యుత్  సమస్య పరిష్కరించేందుకు గొండ్యాల గ్రామంలో సబ్​స్టేషన్​ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇబ్రహీంబాద్, సల్లోనిపల్లి, హన్వాడ, టంకర, కొత్తపేటల్లో టెన్త్​ స్టూడెంట్లకు డిజిటల్  కంటెంట్  స్టడీ మెటీరియల్, డబుల్  డెస్క్  బెంచ్ లను అందజేశారు. ఎస్ఈ పీవీ రమేశ్, లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.