ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శుక్రవారం మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని మాచన్ పల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో పలు రకాల భూ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో భూ సమస్యలకు  భూ భారతి వల్ల పరిష్కారం లభించనుందన్నారు. 

 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూ భారతి చట్టం, భూముల సమస్యలను సత్వర పరిష్కారానికి ఒక మంచి అవకాశమని ఆయన తెలిపారు. భూ సమస్యలు తలెత్తకుండా, కుటుంబ తగాదాలు లేకుండా భూ భారతి చట్టం రైతుకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

పాలమూరు అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

పాలమూరు, వెలుగు: పాలమూరు కార్పొరేషన్ గా మారిందని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆరు వార్డులలో  రూ. 2 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో  రూ. 200 కోట్లతో మహబూబ్ నగర్ పట్టణంలో సీసీ  రోడ్లు, డ్రైన్ లు కోసం ఖర్చు చేశామని ఆయన తెలిపారు.