- మన్యంకొండలో వన మహోత్సవం
మహబూబ్ నగర్ రూరర్, వెలుగు: ప్రతి ఒక్కరూ విధిగా కనీసం 10 మొక్కలను నాటాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని మన్యంకొండ శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ స్వర్ణాసుధాకర్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్రతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మహబూబ్ నగర్ జిల్లాకు 58 లక్షల టార్గెట్ను నిర్ణయించినట్లు తెలిపారు.
గతంలో మాదిరి రికార్డుల కోసం కాకుండా ప్రతి చెట్టును బతికించేలా అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సీఈవో రాఘవేందర్ రావు, డీఆర్డీఏ పీడీ నర్సింహులు, డీఎఫ్వో సత్యనారాయణ, తహసీల్దార్ సుందర్ రాజ్, ఇన్ చార్జి ఎంపీడీవో నరేందర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లు నర్సింహ్మారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.