
పాలమూరు, వెలుగు: పాలమూరు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన సందర్భంగా పట్టణంలోని శిల్పారామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న మహా నగరోత్సవం ముగింపు కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన మహబూబ్ నగర్ పట్టణాన్ని కూడా స్వచ్ఛ మహబూబ్ నగర్ గా అభివృద్ధి చేయాలని కోరారు. పట్టణానికి చెందిన ఎందరో కళాకారులు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించిందన, ఇదే పరంపరను కొనసాగిద్దామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.