బామ్మర్ది తప్పును వెనకేసుకొస్తే కేటీఆర్ రాజకీయ సమాధి కాక తప్పదు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

బామ్మర్ది తప్పును వెనకేసుకొస్తే కేటీఆర్ రాజకీయ సమాధి కాక తప్పదు.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం పీక్స్ చేరింది.. తాజాగా ఈ అంశంపై స్పందించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజ్ పాకాల పామ్ హౌస్ లో డ్రగ్స్ వాడినట్లు పెద్ద అభియోగం ఉందని.. కేటీఆర్ దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బామ్మర్ది తప్పుచెస్తే కేటీఆర్ వెనుకేసుకొచ్చే  ప్రయత్నం చేయొద్దని.. బామ్మర్ది తప్పును వెనుకేసుకొస్తే కేటీఆర్ రాజకీయంగా సమాధి కాక తప్పదని అన్నారు.

తప్పు చేయక పోతే హోస్ట్ రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. జన్వాడ పామ్ హౌస్ లో స్ట్రింగ్ ఆపరేషన్ జరగలేదని.. కేవలం పిర్యాదు మేరకే పోలీసులు దాడి చేశారని స్పష్టం చేశారు. రాజ్ పాకాల గతంలో జూబ్లీ హిల్స్ లో హై లైఫ్ పబ్ ను నడిపాడని..ఆ పబ్ లో రాజ్ పాకాల డ్రగ్స్ నడిపాడని అందరికీ తెలుసని అన్నారు. ఓనర్ రాజ్ పాకాల లేకుండా ఇంట్లో దావత్ చేస్తారా అని ప్రశ్నించారు. రాజ్ పాకాల క్లోజ్ ఫ్రెండ్ విజయ్ మద్దూరి డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికిపోయాడని అన్నారు.

రాజ్ పాకాల పోలీసుల ఎదుట జరిగిన విషయం చెప్పకపోతే అందరూ డ్రగ్స్ వాడినట్లు ప్రజలు భావిస్తారని అన్నారు. రాజ్ పాకాల 111 జీవో లో ఇల్లు ఎలా కట్టుకున్నారని ప్రశ్నించారు.9 ఏండ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు లిక్కర్ కు పర్మిషన్ తీసుకోవాలాని తెలియదా అని ప్రశ్నించారు. గృహ ప్రవేశం చేసి దావత లు చేసుకోవడం తెలంగాణలో కొత్తేమికాదని.. తెలంగాణలో రూల్ ఆఫ్ లా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయట పడుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం,డ్రగ్స్ ఏరులై పారిందని అన్నారు.

ALSO READ : సిగ్గు శరం ఉందా కేటీఆర్.. ఆ అమ్మాయిల వివరాలన్నీ బయటపెట్టు: షబ్బీర్ అలీ

16 విదేశీ మద్యం బాటిళ్లు తో రాజ్ పాకాల అడ్డంగా దొరికిపోయారని.. 6.5 లీటర్ల కంటే ఎక్కువ మద్యం ఉంటే ఎక్సైజ్ పరిమిషన్ తీసుకోవాలని కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సెర్చ్ చేయడానికి వారెంట్ అవసరం లేదని చట్టం లో NDPS యాక్ట్ చెప్తుందని.. అది తెలియక కేటీఆర్ నవ్వుల పాలు అవుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జడ్జిలతో జరిగే విచారణలో కాళేశ్వరం స్కామ్,ఫోన్ ట్యాపింగ్,భూదాన్ స్కామ్ లు బయటకు వస్తాయని అన్నారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.