మహబూబ్ నగర్ రూరల్,వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కళాశాలలకు స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొమ్మిది నెలల శ్రమ కు ఫలితంగా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తో పాలమూరు యూనివర్సిటీ లో ఇంజనీరింగ్, లా కళాశాల ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. సీఎం చొరవతో రూ. 100 కోట్ల నిధులు యూనివర్సిటీకి వచ్చాయని అన్నారు. దక్షిణ భారతదేశంలో రూ. 100 కోట్లు వచ్చిన రెండో యూనివర్సిటీ మనదే అన్నారు.
రాష్ట్రం లో ఇప్పటి వరకు కేవలం కాకతీయ, ఉస్మానియా, జేఎన్టీయూల్లో లలో మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఇప్పుడు పాలమూరు యూనివర్సిటీ కూడా వాటితో కలవడం ఆనందం గా ఉందన్నారు. కాలేజీలను మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీసీసీ ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.
క్రీడా స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు ఎదగాలి
పాలమూరు, వెలుగు:విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పీసీసీఉపాధ్యక్షులు, మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ ఒబేదుల్ల కొత్వాల్ అన్నారు. జిల్లా స్టేడియంలో 43వ తెలంగాణ జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కోకో పోటీలు రెండవ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
బాల బాలికలు చదువులో రాణించాలంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. అందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చదువుతోపాటు క్రీడలను కూడ ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం స్టేడియంలో బాస్కెట్ బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ బాస్కెట్ బాల్ ఆడుతూ విద్యార్థులను ఉత్సాహపరిచారు.