పాలమూరు అభివృద్ధికి అడుగులు వేద్దాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు అభివృద్ధికి అడుగులు వేద్దాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు : పాలమూరులో అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 14 వ వార్డు వీరన్న పేటలో రూ. కోటి 69 లక్షల 50 వేలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్ ను  ప్రారంభించారు. 

అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, పలువార్డులలో  వార్డు సభల్లో  ప్రజల నుంచి రేషన్ కార్డ్ దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పాలమూరు పట్టణంలో ఏడాది కాలంలోనే 150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు, ముఖ్యంగా   మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని  భవనాలు లేని చోట  నూతనంగా మహిళా భవనాలను కట్టిస్తామని హామీ ఇచ్చారు.

 కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి, క్రిస్టియన్ మైనార్టీ పట్టణ అధ్యక్షులు శ్యామల్ దాసరి, మున్సిపాలిటీ డీఈ నరసింహ , ఈఈ వైష్ణవి పాల్గొన్నారు.