గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు:  గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్  అని ఆయన ఆశీస్సులతో  అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం   సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ  జయంతి సందర్భంగా  పట్టణం లోని అయ్యప్ప కొండపై  సేవాలాల్ మరియమ్మ యాడి ఆలయం ఆవరణలో జరిగిన బోగ్ బండార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ డి జానకి, ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ మహారాజ్ ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యేమాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రతి తాండా కు బీటీ రోడ్డు వేయాలనే సంకల్పం తీసుకున్నారని,  మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని  హన్వాడ, మహబూబ్ నగర్ లో ఉన్న తాండా ల్లో  బిటి రోడ్డు పనులకు 5 కోట్ల రూపాయల తో  శంకుస్థాపన చేశామన్నారు.    అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలో కలెక్టర్ విజయేంద్ర బోయి గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో అలరించారు,  గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి  
పాల్గొన్నారు. 

మరికల్​ :  సంత్​ సేవలాల్​ మహరాజ్​ మందిరం నిర్మాణానికి ప్రభుత్వం తరపున కృషి చేస్తానని మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, తండా వాసులకు భరోసా ఇచ్చారు. మండలంలోని బుడ్డగానితండాలో శనివారం మహరాజ్​ జయంతి వేడుకల్లో అధికారికంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు.