పాలమూరు, వెలుగు: పదేళ్లుగా అభివృద్ధి లేని పాలమూరును అన్ని రంగాల్లో డెవలప్ చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో సంవత్సరం కాలంలో రూ. 120 కోట్లు కేటాయించి డెవలప్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
భవిష్యతులో పాలమూరు కార్పొరేషన్ గా మార్చుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , కౌన్సిలర్ మాధవీలత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, నాయకులు చిన్న, కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎంఇ బస్వరాజు, డీఈ నర్సింహా, ఏఈ వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.