పాలమూరు, వెలుగు: పురాతన దేవాలయాలు అభివృద్ధి చేసుకుందామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని తిరుమల దేవుని గుట్ట లోని శ్రీ రామాంజనేయ స్వామి పురాతన దేవాలయం లో రూ. 10 లక్షలతో నిర్మించనున్న షెడ్, స్టేర్ కేస్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. వేసవిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు షెడ్, స్టేర్ కేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
అలాగే కొత్తగా మెట్లు ప్రాంతంలో షెడ్ నిర్మాణానికి ఎస్టిమేషన్స్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాదత్ అలి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, ఏఈ అంజిరెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు సామ్యూల్ దాసరి, బుద్దారం సుధాకర్ రెడ్డి, గుండా మనోహర్, ఇమ్రాన్, ను రామాంజనేయులు, కోట రత్నం పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ రూరల్ : మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శనివారం వేంకటేశ్వర స్వామి పాలకమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం మన్యం కొండ దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.