పాలమూరులో  రెడ్ క్రాస్ డయాగ్నోస్టిక్ సెంటర్ కు భూమి కేటాయించాలి :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డ

పాలమూరులో  రెడ్ క్రాస్ డయాగ్నోస్టిక్ సెంటర్ కు భూమి కేటాయించాలి :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డ

పాలమూరు, వెలుగు:  పాలమూరులో రెడ్ క్రాస్  డయాగ్నోస్టిక్ సెంటర్ కు భూమి కేటాయించి, భవన నిర్మాణానికి చేయూతనివ్వాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను కలిసి వినతిపత్రం అందించారు.  స్పందించిన ఆయన భూ కేటాయింపునకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.  రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ అజయ్ మిత్రా, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, మహబూబ్ నగర్ చైర్మన్ లయన్ నటరాజ్, రాష్ట్ర ఈసీ సభ్యుడు రమణయ్య పాల్గొన్నారు,