పాలమూరులో అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రం : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరులో అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రం : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్  పట్టణంలో రూ.17 కోట్లతో అంతర్జాతీయ పూలే, అంబేద్కర్  విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆర్అండ్ బీ గెస్ట్​హౌస్​ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్  ఆవరణలో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువతకు, నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 16న మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్  కమిషనర్​ నాలెడ్జ్  సెంటర్  కోసం జీవో జారీ చేశారని చెప్పారు.

 రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, అందులో సెమినార్ హాల్స్, రీడింగ్  రూమ్స్, డిజిటల్  హాల్స్, క్లాస్ రూమ్​లతో లక్ష పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. మెట్టుగడ్డ ప్రాంతంలోని డైట్  కాలేజీ ఆవరణలో స్కిల్  డెవలప్​మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లైబ్రరీ చైర్మన్  మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, గుండా మనోహర్, శ్రీనివాస్ యాదవ్, రాజు గౌడ్, దేవేందర్ నాయక్  పాల్గొన్నారు.