పాలమూరు, వెలుగు: యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో శుక్రవారం ఆయన బుక్స్ పంపిణీ చేశారు. విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఇంటర్ విద్య భవిష్యత్‌కు పునాది వంటిదని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ భగవంతాచారి, ఒకేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ర్ట సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తన క్యాంపు ఆఫీసులో శుక్రవారం ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్లో గత ప్రభుత్వ పాలనలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం రూ.32 వేల కోట్ల డ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసిందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.