ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

ఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 పాలమూరు, వెలుగు: ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు.  సోమవారం  మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ పై సూపర్ వైజర్లు, ఆర్పీలతో సమావేశమయ్యారు. 25 శాతం రాయితీ విషయాన్ని ప్రజలకు చెప్పాలని సూచించారు.

పట్టణంలోని మెట్టుగడ్డలో స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ పనులను గ్లోబల్ క్యాపబిలిటీ సంస్థ డైరెక్టర్ రాజీవ్ త్రివేదితో పరిశీలించారు. క్లాక్ టవర్ సెంటర్​లో  ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులను కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. 

గ్రామాలు అభివృద్ధి చెందాలి

మహబూబ్​నగర్​రూరల్, వెలుగు: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  ధర్మాపూర్ లో సీసీరోడ్లు, కాలువల పనులకు ఎంపీ డీకే అరుణ తో కలిసి  శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు..

బీజేపీని బలోపేతం చేయండి

మదనాపురం, వెలుగు:  బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం గోపన్ పేటలో పార్టీ జెండా ఆవిష్కరించారు.  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. వివిధ పార్టీలకు చెందిన 40 మంది బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.