హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత ఉద్యమకారులతో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉద్యమకారులకు ఇన్విటేషన్లు పంపామని, వారే చీఫ్ గెస్ట్‌లుగా అటెండ్ అవుతున్నారని తెలిపారు. అలాగే, అన్ని పార్టీలకు కూడా ఇన్విటేషన్లు పంపామని చెప్పారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
తొలిసారి రాష్ట్ర గీతాన్ని ప్రకటించుకుంటున్నామన్నారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా పరిమితంగా చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని కోరారు. చాలా మంది ఉద్యమకారులకు ఇన్విటేషన్ అందలేదన్న ప్రచారం అవాస్తమన్నారు.