అర్హులకు త్వరలో రేషన్ కార్డులు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

అర్హులకు త్వరలో రేషన్ కార్డులు : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్‌, వెలుగు: అర్హులందరికీ త్వరలో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రూరల్ మండలం భవానీ తండాలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు, జీపీ భవనం, ఫతేపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు లైబ్రరీల్లో చదువుకొని పోటీపరీక్షల్లో రాణించాలన్నారు. 

ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఎంపీడీవో కరుణశ్రీ, పీఆర్ ఏఈ రాములు, స్పెషల్ ఆఫీసర్ పక్కీరన్న, మాజీ సర్పంచ్ పాండు, లీడర్లు రవి, కృష్ణ, చిన్నయ్య, భాస్కర్ పాల్గొన్నారు.

ప్రజల సంక్షేమానికి వినూత్న పథకాలు

పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్​ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. కార్యక్రమంలో బుద్దారం సుధాకర్ రెడ్డి, మారేపల్లి సురేందర్ రెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.