పాలమూరు, వెలుగు: పట్టణంలోని 3,4 వార్డుల్లో ఆదివారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కాలనీలో కొలువైన అభయాంజనేయస్వామి టెంపుల్ లో ఆయన పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కౌన్సిలర్లు రామాంజనేయులు, యాదమ్మ హనుమంతు, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, శివశంకర్ పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి కృషి
హన్వాడ:రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఇబ్రహీంబాద్ కు చెందిన మత్స్యుకారుల సంఘం సభ్యులు హేమ సముద్రంలో చేపలు విడిచే కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారులు చెరువులను నమ్ముకుని జీవిస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చెరువులను కాపాడుకోవాలని సూచించారు. సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, నాయకులు ఎర్ర వెంకటయ్య, పి వెంకటయ్య, అంజిలయ్య పాల్గొన్నారు.