గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక : ఎమ్మెల్యే జారే ఆది నారాయణ

గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక : ఎమ్మెల్యే జారే ఆది నారాయణ
  • ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దు

అశ్వారావుపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలం మొద్దులమాడ, కోరంగాపురం గ్రామాల్లో  రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాల్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, సంక్షేమ పథకాలకు గ్రామసభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరూ ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు.

  కార్యక్రమంలో అధికారులు తహాసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, నాయకులు జూపల్లి రమేశ్, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షుడు చిన్నం శెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.