- హాజరుకాని పద్మారావు గౌడ్, మాగంటి, ముఠా గోపాల్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రి మహమూద్అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, పార్టీ కార్యక్రమాల ఇన్చార్జ్ దాసోజు శ్రవణ్ తదితరులు హాజరయ్యారు. ముందస్తు సమాచారం ఇచ్చినా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరుకాలేదు. ఏడాది దాటినా హైదరాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు గోపీనాథ్ చేపట్టలేదు. ముఖ్య నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలతోనే ఆయన బాధ్యతలు స్వీకరించ లేదనే ప్రచారం ఉంది. దీనికి బలం చేకూరుస్తూ ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు మాత్రమే ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.