రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

గోదావరిఖని, గంగాధర, హుజూరాబాద్‌‌, వేములవాడ: రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. ప్రవాసీ ఎమ్మెల్యే యోజనలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశాల్లో పాల్గొన్నారు. చొప్పదండిలో అసెంబ్లీ కన్వీనర్​శ్రవణ్‌‌కుమార్​ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవరాజు ముత్తిముద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్యాల నుంచి గంగాధర మండలం కొండన్నపల్లి బొమ్మలమ్మ గుట్ట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్​యాదవ్, లక్ష్మీనారాయణ, రామానుజం, బాల్​రెడ్డి పాల్గొన్నారు. హుజూరాబాద్‌‌లో అస్సాం ఎమ్మెల్యే ధర్మేశ్వర్ కోన్వర్ మీడియాతో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, లీడర్లు రాజు, సంపత్ రావు, గౌతమ్ రెడ్డి, రఘు, పాల్గొన్నారు.  రామగుండం నియోజకవర్గంలో మహారాష్ట్ర ఎమ్మెల్యే రాణా జగ్జీత్‌‌‌‌ సిన్హా పాటిల్‌‌‌‌ ఎన్టీపీసీ జ్యోతిభవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్‌‌‌‌, కార్పొరేటర్లు లలిత, కిషన్‌‌‌‌ రెడ్డి, రాంచందర్‌‌‌‌, మహేశ్‌‌‌‌, పాల్గొన్నారు. వేములవాడలో అస్సాం ఎమ్మెల్యే హేమంగ్​తకోరియా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, తుల ఉమ, సంతోష్ బాబు పాల్గొన్నారు.